KRNL: పత్తికొండ మండల ప్రజాపరిషత్ పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థికి ఆయన వేషధారణ వేసి పాఠ్యాంశాలు బోధించారు. మహనీయుల వేషధారణ వల్ల వారి నడవడిక తెలుసుకోవడంతో విద్యార్థుల్లో వారి పట్ల గౌరవం అభిమానం పెంపొందుతుందని, క్రమశిక్షణతో మెలుగుతారని టీచర్ మారుతి అన్నారు.
ఆంధ్రప్రదేశ్
సర్వేపల్లి రాధాకృష్ణన్ వేషధారణలో విద్యార్థి పాఠాలు


