హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోపాల్ పేటలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు

WNP: గోపాల్ పేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ సుప్రజాత మాట్లాడుతూ.. నిజమైన ఉపాధ్యాయులు విద్యార్థులలో స్వీయ ఆలోచనా శక్తిని, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతారని అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.