KRNL: తెర్నేకల్ జడ్పీహెచ్ పాఠశాలలో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్న పి. నబీ రసూల్‌కు ఉత్తమ సేవలకు గుర్తింపుగా అవార్డు లభించింది. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యాంశాలను అర్థవంతంగా బోధించడంతో పాటు నైతిక విలువలు, ప్రస్తుత సమాజ పరిస్థితులపై అవగాహన కల్పించాలన్నారు. అప్పుడే విద్యార్థులు విషయాలను సులభంగా అర్థం చేసుకుని ఉన్నత లక్ష్యాల వైపు ముందుకు సాగుతారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఉత్తమ సేవలకు టీచర్ నబీ రసూల్‌కు అవార్డు!


