హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సెర్ప్ కార్యాలయంలో కనిపించని సిబ్బంది

ASF: చింతలమానేపల్లి మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన పాటించడంలో అధికారులు విఫలమవుతున్నారు. సెర్ప్ కార్యాలయంలో నిత్యం ఇదే తంతు కొనసాగుతోంది. నిర్ణీత వేళల్లో ఆఫీస్ వెళితే అటెండర్ మినహా సిబ్బంది ఎవరూ అందుబాటులో ఉండడం లేదు. అధికారులు, సిబ్బంది గైర్హాజరుతో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తుండటంతో పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.