హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లెలో విద్యపై ప్రేరణాత్మక కార్యక్రమం

అన్నమయ్య: మదనపల్లె ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో తొలి సంవత్సరం బీటెక్ విద్యార్థులకు ఇండక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ‘విలువల ఆధారిత విద్యతో భారతదేశ మార్పు’ అంశంపై స్వామి తురీయానంద సరస్వతి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. సాంకేతిక విద్యతోపాటు నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యత, మానవీయ విలువలు పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.