హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు నూతన పాస్ పుస్తకాలు పంపిణీ

SKLM: కొత్తూరు(M) పారాపురంలో రాజముద్రతో ముద్రించిన నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శనివారం రైతులకు పంపిణీ చేశారు. భూమి హక్కుల వివరాలను పక్కాగా నమోదు చేసి రైతులకు మరింత భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. రైతుల సంక్షేమం, భూమి హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.