హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఫీజు బకాయిల విడుదల కోరుతూ బీఆర్ఎస్ నిరసన ర్యాలీ

NLG: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతూ శనివారం నల్గొండలో బీఆర్ఎస్ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఎన్జీ కళాశాల నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు ఈ ర్యాలీ సాగింది. నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతుందని వారు ఆరోపించారు.