హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి!

NLG: నాగార్జునసాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై నెల్లికల్ ఎక్స్ రోడ్ సమీపంలో దయ్యాలగండి వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపైకి కారు దూసుకెల్లడంతో బైక్‌పై ఉన్న వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు నాగార్జునసాగర్ పైలాన్‌ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.