హైదరాబాద్: 28°C
తెలంగాణ

కెనాల్‌లో యువకుడి మృతదేహం లభ్యం

MNCL: మందమర్రి మండలం కేసనపల్లి సమీప కెనాల్లో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు మందమర్రికి చెందిన సాయిరాం(21)గా గుర్తించినట్లు ఎస్సై ఎన్.రవికుమార్ శనివారం తెలిపారు. మూడు రోజుల క్రితం హరిపురంలోని బంధువుల ఇంటికి వచ్చిన సాయిరాం, మరో ఇంటికి వెళ్తూ ప్రమాదవశాత్తు కెనాల్లో పడిపోయి ఉంటాడని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.