KRNL: ఎల్‌నినో ప్రభావంతో పెద్దకడబూరులో ఈ సారి వరి సాగు ఆశించిన స్థాయిలో జరగలేదు. దీంతో రైతులు వేసిన వరి నారుమళ్లకు కొనుగోలుదారులు లేకపోవడంతో చివరకు పశువులకు మేతగా వదిలేశారు. గ్రామానికి చెందిన రైతులు మూర్తి, ప్రకాశ్, నికోలస్ సాగు చేసిన వరి నారు కొనుగోలు చేసేవారు లేకపోవడంతో పశువులకు మేతగా మారింది. దీంతో రైతులు పెట్టుబడులు నష్టపోయామని వాపోయారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దకడబూరులో పశువులకు మేతగా వరినారుమళ్లు..!


