హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటరు నమోదుకు మరో అవకాశం: మున్సిపల్ కమిషనర్

ఖమ్మం పట్టణంలోని కొత్తగా ఓటరుగా నమోదు, ఓటరు వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకునే వారికి మరో అవకాశం కల్పించినట్లు శనివారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. నగర ప్రజలు BLOల వద్దకు వెళ్లి ఫారం-6, ఫారం-7, ఫారం-8లతో పాటు అవసరమైన పత్రాలు, డాక్యుమెంట్లను సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.