హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మద్యం సేవించి వాహనాలు నడపరాదు'

SKLM: మద్యం సేవించి వాహనాలు నడుపరాదని టెక్కలి డివిజన్-4కు చెందిన శక్తి టీం హెడ్ కానిస్టేబుల్ ఎం. గిరిధర్ పేర్కొన్నారు. నందిగామ మండలం తురకలకోట గ్రామంలో ఉన్న పాలిటెక్నికల్ కళాశాలలో శనివారం శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మైనర్లు వాహనాలు నడుపరాదని.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలని ఆయన సూచించారు.