హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొలికేక ధర్నాకు తరలిన నాయకులు

MDK: హబ్సిపూర్‌లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు పొలికేక ధర్నా నిర్వహిస్తున్నారు. ధర్నాకు చేగుంట మండల బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. మాజీ జడ్పీటీసీ ముదం శ్రీనివాస్, మండల అధ్యక్షులు నారాయణరెడ్డి, ఎర్ర యాదగిరి, నెల్లూరు, డిష్ రాజు పాల్గొన్నారు.