హైదరాబాద్: 28°C
వ్యాపారం

40 ఏళ్లకు ఉద్యోగం మానేస్తే EPF నిధులపై వడ్డీ వస్తుందా?

చాలా మంది ఉద్యోగం మానేస్తే పీఎఫ్‌ వడ్డీ ఆగిపోతుందని పొరపడుతుంటారు. కానీ, ఉద్యోగం వదిలేసినా 58 ఏళ్ల వయసు వరకు మీ ఖాతాలోని నిధులపై వడ్డీ కొనసాగుతుంది. ఖాతా ఇన్‌ఆపరేటివ్‌గా మారనంత వరకు ఈ ప్రయోజనం లభిస్తుంది. 55 ఏళ్లలోపు ఉద్యోగం మానేస్తే, 58 ఏళ్లు నిండే వరకు ఆ ఖాతా ఇన్‌ఆపరేటివ్‌ కాదు. కాబట్టి వడ్డీ వస్తుంది.