హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: యూరియా కోసం రైతుల తీవ్ర అవస్థలు

MDK: రామాయంపేటలో యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక పీఏసీఎస్ (PACS) కేంద్రం వద్ద ఎరువుల కోసం ఉదయం నుంచే అన్నదాతలు భారీగా బారులు తీరారు. పంటలకు సమయానికి ఎరువులు అందక, గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగినంత యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.