హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ZC

RR: ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్, హస్తినాపురం సౌత్‌లో నిర్వహించిన ‘వనమహోత్సవం’ మొక్కల పెంపకం కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్న ప్లాంటేషన్ పనులను పరిశీలించి, సమీక్ష నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా కమిషనర్ సూచించారు.