CTR: పుంగనూరు పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో కొలువుదీరిన శ్రీ విరూపాక్షి మారెమ్మ అమ్మవారికి ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే అర్చకులు అమ్మవారి మూలవిరాట్టుకు పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం పసుపు, కుంకుమతో పాటు మల్లె, రోజా, చామంతి తదితర పుష్పాలతో నారాయణి అలంకారంలో అమ్మవారిని శోభాయమానంగా తీర్చిదిద్దారు.
ఆంధ్రప్రదేశ్
నారాయణి అలంకారంలో శ్రీ విరూపాక్షి మారెమ్మ


