హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెలుగు భాష కోసం ఈ టీచర్ కృషి..!

ప్రకాశం: కంభం మండలం హజరత్‌గూడెం ZPHS తెలుగు ఉపాధ్యాయురాలు ఆకవీటి సరోజ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. తెలుగు భాష, సాహిత్యంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు ఆమె విశేష కృషి చేస్తున్నారు. పద్యాలు, కథలు, కవితలు, వ్యాసరచన వంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీస్తున్నారు. అదనపు తరగతి గదులు సొంత నిధులతో నిర్మించారు.