హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు.!

KDP: నగరంలోని అక్కాయపల్లె అక్కదేవతల ఆలయంలో శ్రావణమాస శనివారం సందర్భంగా వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున అభిషేకాలు, కుంకుమార్చనలు చేపట్టారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.