HNK: జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలిగా రాయపర్తి మండల కేంద్రానికి చెందిన కొయ్యాడ వాసంతి ఎంపికయ్యారు. హసన్‌పర్తి(M)నాగారం ZPHSలో HMగా ఆమె సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్నారు. రాయపర్తి ZPHSలో పదో తరగతి వరకు చదివిన వాసంతి, అదే పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (సోషల్)గా ఉద్యోగంలో చేరారు. ఆమెకు అవార్డు దక్కడంతో రాయపర్తిలో హర్షం వ్యక్తమవుతోంది.
తెలంగాణ
జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలిగా వాసంతి


