హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉలిగేపల్లిలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం

GDWL: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్దకల్ మండలం ఉలిగేపల్లి ప్రాథమిక పాఠశాలలో శనివారం గురువులను ఘనంగా సన్మానించారు. సర్పంచ్ కుమ్మరి లక్ష్మి, కుమ్మరి తిప్పన్న ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో వారి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.