హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్మూర్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేత

NZB: ఆర్మూర్ పట్టణంలోని 15వ వార్డుకు చెందిన వికార్ హుస్సేన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కును పీవీఆర్ భవన్‌లో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా CMRF ద్వారా ఆర్థిక సాయం అందించిన వినయ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.