SDPT: జగదేవపూర్ మండలం తిమ్మాపూర్‌లో బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో ప్రచారం చేపట్టారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. మహిళలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇచ్చిన హామీల ప్రకారం ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తాలను వివరించారు. ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలన్నారు.
తెలంగాణ
బీఆర్‌ఎస్ ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ప్రచారం


