హైదరాబాద్: 28°C
తెలంగాణ

వన్యప్రాణుల రక్షణకు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు

NGKL: నల్లమలలో ఇటీవల పులి కూన మృతి చెందిన ఘటన నేపథ్యంలో అటవీశాఖ అప్రమత్తమైంది. వన్యప్రాణుల రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో అదనపు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుపై సర్వే చేపట్టారు. మరో 2–3 నెలల్లో మరిన్ని స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను తగ్గించనున్నట్లు అటవీశాఖ డివిజన్ అధికారి యష్ చంద్రప్రకాశ్ తెలిపారు.