MDK: రామాయంపేట శివారు జాతీయ రహదారి వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి కల్వర్టు సమీపంలోని నీటి కుంటలో పడటంతో సిద్దిపేట జిల్లా హిమామాబాద్‌కు చెందిన శివరాత్రి మహేష్ (40) అక్కడికక్కడే మృతిచెందాడు. అత్తగారింటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
తెలంగాణ
బైక్ కుంటలో పడి వ్యక్తి మృతి


