హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసుల సూచనలు

SRD: జిన్నారం మండలంలోని గణేష్ ఉత్సవాల నేపథ్యంలో ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో మండపాల నిర్వాహకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. మండపాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్ సుధీర్ కుమార్ సూచించారు. రోడ్లపై మండపాలు ఏర్పాటు చేయరాదని, విద్యుత్ భద్రత, సీసీటీవీ, వెలుతురు, రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు.