హైదరాబాద్: 28°C
వార్తలు

ఒక్కసారీ గెలవలేదు.. కానీ ఆయనో చరిత్ర!

భారత ఎన్నికల చరిత్రలో ప్రత్యేక గుర్తింపున్న 'ధర్తి పకడ్' నాగర్‌మల్ బాజోరియా(96) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ పాట్నాలోని ఓ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. వార్డు నుంచి రాష్ట్రపతి పదవి వరకు 280కి పైగా ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఒక్కసారి కూడా గెలవలేదు. ఇందిరా గాంధీ, వాజ్‌పేయి వంటి ఉద్దండులపైన పోటీ చేసిన బాజోరియా మృతితో ఎన్నికల చరిత్రలో ఓ శకం ముగిసింది.