కరెంట్ షాక్‌తో విజయనగరం జిల్లా వాసి మృతి చెందాడు. ఈ ఘటన మక్కవ మండలంలో జరిగింది. నంద-లొద్ద గ్రామాల సమీపంలో రోడ్డు పనుల పరికరాలు తరలించేందుకు గుర్లకు చెందిన ఎం.ఆనంద్ (46), మరో ఇద్దరు కార్మికులు ఈశ్వరరావు, వెంకటరావు వెళ్లారు. అక్కడ క్రేన్ సాయంతో పరికరాలు ఎత్తుతుండగా విద్యుత్ తీగలు క్రేన్‌కు తగిలాయి. దీంతో ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్
పనిచేస్తుండగా కరెంట్ షాక్.. వ్యక్తి మృతి


