ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎంపికైన 48 మంది టీచర్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేయనున్నారు. వీరిలో 26 మంది పురుషులు, 22 మంది మహిళలున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు అవార్డులు అందుకోనున్నారు. తెలంగాణలోని కామారెడ్డికి చెందిన భవాని బొంపెల్లి, ఏపీకి చెందిన రాజేష్ కూలూరికి ఈ జాతీయ పురస్కారాలు దక్కాయి.
వార్తలు
48 మంది ఉత్తమ టీచర్లు.. నేడు అవార్డుల ప్రదానం


