హైదరాబాద్: 28°C
వార్తలు

ఎథిక్స్ కమిటీకి రిప్లై ఇవ్వనున్న కౌశిక్ రెడ్డి

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేడు శాసనసభ ఎథిక్స్ కమిటీకి తన సమాధానాన్ని సమర్పించనున్నారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కమిటీ అడిగిన ప్రశ్నలకు కౌశిక్ రెడ్డి నేడు రాతపూర్వకంగా తన వివరణను అందజేయనున్నారు. ఆయన ఇచ్చే సమాధానం ఆధారంగా కమిటీ తదుపరి నిర్ణయం తీసుకోనుంది.