హైదరాబాద్: 28°C
వార్తలు

‘22A, భూభారతి సమస్యలు పరిష్కరించాలి’

TG: ఇందిరాపార్క్(HYD) వద్ద బీజేపీ శ్రేణులు ధర్నా చేపట్టనున్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ ఈ నిరసన కార్యక్రమం కొనసాగనుంది. రాష్ట్రంలో 22A, భూభారతి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేయనున్నారు. భూ యజమానులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ఈ సమస్యలపై దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయనున్నారు.