హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SIR గడువు పొడిగింపుతో కీలక నిర్ణయం

ATP: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)కు సంబంధించి శని, ఆదివారాలు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. ఎస్ఐఆర్ గడువు పొడిగించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఓటరు నమోదు, వివరాల మార్పుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు.