హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దెందులూరు ఎంఈవోగా త్రిపుర సుందరి బాధ్యతలు

ELR: దెందులూరు మండల విద్యాశాఖాధికారిగా త్రిపుర సుందరి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల యూటీఎఫ్ నేతలు, ఉపాధ్యాయులు ఆమెను ఘనంగా స్వాగతించి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, విద్యార్థుల అభ్యున్నతికి సమన్వయంతో పనిచేస్తామని యూటీఎఫ్ నేతలు తెలిపారు.