ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్(SRCC) శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇవాళ(ఉపాధ్యాయ దినోత్సవం) రాత్రి 7 గంటలకు ఈ వేడుకలకు హాజరై, ప్రసంగిస్తారు. కామర్స్, ఎకనామిక్స్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఈ కాలేజీని 1926లో ప్రముఖ పారిశ్రామికవేత్త సర్ శ్రీరామ్ స్థాపించారు. 100 ఏళ్ల ప్రయాణంలో ఈ సంస్థ ఎంతోమందిని తీర్చిదిద్దింది.
వార్తలు
SRCCకి 100 ఏళ్లు.. వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని


