ప్రకాశం: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లాలో గురుపూజోత్సవ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 5న ఉదయం 10 గంటలకు ఒంగోలులోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యా యులుగా ఎంపికైన 72 మందిని సన్మానించనున్నారు. ఈ వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారి సి. రేణుక తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీచర్స్ డే వేడుకలకు ప్రకాశం జిల్లా సిద్ధం..!


