హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింగర్ చెరువును పరిశీలించిన చీఫ్ విప్

PLD: నాగార్జునసాగర్ జలాలతో సింగర చెరువు నిండుతుండటాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పరిశీలించారు. వినుకొండ ప్రజలకు ప్రతిరోజూ సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని తాగునీటి చెరువులను నింపి ప్రజలు, పశువుల దాహార్తిని తీర్చనున్నట్లు చెప్పారు. శాశ్వత తాగునీటి పథకం పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను జీవి ఆదేశించారు.