హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నిర్వహణపై అవగాహన కార్యక్రమం

NTR: గంపలగూడెం మండలం నెమలిలో పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రలోభాలు, బెదిరింపులకు గురికాకుండా ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.