హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముంజేరులో ప్రజా దర్బార్

VZM: ముంజేరు జనసేన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే లోకం మాధవి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ప్రతి సమస్యను విన్న ఆమె స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.