హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

NDL: సంజామల మండల కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గోపాలస్వామి ఆలయం వద్ద ప్రజలకు అన్నదానం చేశారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. సాయంత్రం శ్రీకృష్ణుని విగ్రహాన్ని అలంకరించి గ్రామంలో వైభవంగా ఊరేగించారు.