హైదరాబాద్: 28°C
వార్తలు

'డిజిటల్ అరెస్ట్' కేసులు.. దేశవ్యాప్తంగా CBI సోదాలు

డిజిటల్ మోసాలపై నమోదైన కేసులకు సంబంధించి CBI కీలక ఆపరేషన్ చేపట్టింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో సోదాలు జరిపింది. మూడు కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురుని అరెస్టు చేసింది. వారి నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు, డిజిటల్ పరికరాలు, ఇతర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. డిజిటల్ అరెస్టుల పేరుతో బాధితులు దాదాపు రూ.42 కోట్లు నష్టపోయినట్లు అంచనా వేసింది.