హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి ఉంగుటూరు రైల్వే గేట్ మూసివేత

ELR: ఉంగుటూరు రైల్వే గేటు నంబర్ 366ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే, విజయవాడ డివిజన్ ప్రకటించింది. ట్రాక్ మరమ్మతుల దృష్ట్యా శనివారం ఉదయం 7 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వారం రోజుల పాటు గేటు మూసివేయనున్నారు. సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (పి.వే) తాడేపల్లిగూడెం MRO, పంచాయతీ, పోలీసు, RTC అధికారులకు లేఖ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.