'ధర్తీపకడ్'గా పేరుగాంచిన నాగార్మల్ బజోరియా (96) కన్నుమూశారు. బీహార్‌కు చెందిన ఆయన 280కి పైగా ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే, ఇప్పటివరకూ ఒక్కసారి కూడా గెలవకపోవడం గమనార్హం. వార్డు కౌన్సిలర్ స్థాయి నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు ఆయన పోటీ చేశారు. ఇందిరా గాంధీ, వాజ్‌పేయి, రాజీవ్ గాంధీ, అద్వానీ వంటి దిగ్గజాలకు వ్యతిరేకంగా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.
వార్తలు
280 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ 'ధర్తీపకడ్' ఇక లేరు


