హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు అవగాహన సదస్సు

నరసరావుపేట: భావన జూనియర్ కళాశాలలో మహిళా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఐ అశోక్ బాబు మాట్లాడుతూ.. యువత గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. మహిళల భద్రతకు 'శక్తి యాప్' వినియోగించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.