హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కుల అందజేత

కృష్ణా: కష్టకాలంలో కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన ముగ్గురు టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ సభ్యత్వ బీమా కింద రూ.15 లక్షల చెక్కులను కూటమి నాయకులతో కలిసి ఆయన అందజేశారు. ఈ కార్యకర్తల సంక్షేమానికి పార్టీ అధిష్టానం ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని ఆయన పేర్కొన్నారు.