హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. శ్రీ మల్లికార్జున మహామండపంలో రెండు విడతలుగా ఆర్జిత, ఉచిత వ్రతాలు గావించారు. 600 మందికిపైగా మహిళలు పూజలో పాల్గొన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో పూజా సామగ్రి ఉచితంగా అందించారు. పసుపు, కుంకుమ, రవికె, గాజులు, ప్రసాదాలతో పాటు ఉచిత దర్శనం కల్పించారు.