హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నెమలి పింఛాలతో శ్రీకృష్ణునికి అలంకరణ

NLR: దగదర్తి పట్టణంలో శుక్రవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం నెమలి పింఛాలతో స్వామివారిని అందంగా అలంకరించారు. ప్రత్యేక అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రసాదాలను స్వీకరించారు.