హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్లమెంట్ బీజీనెస్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా ఎంపీ సానా

కాకినాడకు చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ బాబును పార్లమెంట్లోని ప్రతిష్ఠాత్మక బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా రాజ్యసభ ఛైర్మన్ నామినేట్ చేశారు. ఈ మేరకు పలు స్టాండింగ్ కమిటీలకు సభ్యులను నామినేట్ చేశారు. రాజ్యసభ కమిటీల పునర్వ్యవస్థీకరణలో భాగంగా స్టాండింగ్ కమిటీల సభ్యుల నియామకం చేపట్టారు.