హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జక్కంపూడి రాజా పై SC, ST అట్రసిటీ కేసు

E.G: నల్లజర్ల పోలీస్టేషన్‌లో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇటీవల దూబచర్లలో YSR వర్ధంతి సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుపై జక్కంపూడి అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. దీంతో కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.