హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అగ్ని ప్రమాదం.. రెండు గడ్డివాములు దగ్ధం

KDP: కమలాపురం మండలం కంచన్నగారిపల్లెలో రైతు సాకం మధుసూదన్‌రెడ్డికి చెందిన రెండు గడ్డివాములు శుక్రవారం అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే గడ్డివాములు పూర్తిగా కాలిపోయాయి.