ELR: ఉంగుటూరు టోల్‌గేట్ సమీపంలో ఏలూరు వైపు వెళ్లే జాతీయ రహదారి గుంతలమయంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై తారు లేచిపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. టోల్ వసూలు చేస్తున్నా రోడ్డు మరమ్మతులు పట్టించుకోకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు బోల్తా పడే ప్రమాదం ఉందని, మరమ్మతులు చేపట్టాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఉంగుటూరు జాతీయ రహదారిపై భారీ గుంతలు


